Tue Mar 24 2026 04:39:53 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ భేటీలో ప్రకాశ్ రాజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూరులోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చించేందుకే దేవగౌడతో భేటీ అయ్యారు. దేవగౌడ మాజీ ప్రధాని కావడం, జాతీయ రాజకీయాలపై లోతైన అవగాహన ఉండటంతో ఆయనతో దాదాపు రెండుగంటల పాటు చర్చించే అవకాశముంది. సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

