Mon Feb 02 2026 20:13:53 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయుడు కాదు రాక్షసుడు

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్స్ అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి. యజమాన్యం నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారాయి. వరుసగా జరిగిన మూడు ఘటనల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ డీడీ కాలనీలోని చైతన్య స్కూల్ లో ఉపాద్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. పిల్లలకు తెలియకుండా ఫోటోలు తీసి వేదిస్తున్నాడు. వివిధ జిల్లాల నుంచి వచ్చి హాస్టల్ లలో ఉంటున్న విద్యార్థులపై ఈ రకమైన వేదింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పిల్లలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఉపాద్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

