దావుద్ ఆస్తులు ఇప్పుడు ఏం చేస్తారు?

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కి ముంబాయిలో వున్న ఆస్తులకు సుప్రీం కోర్టు మంగళం పాడేసింది. ఈ ఆస్తులకు తామే వారసులం అంటూ దావుద్ తల్లి అమీనా బీ, సోదరి తల్లి హసీనా పార్కర్ వేసిన పిటిషన్లు కొట్టి వేసింది కోర్టు. ముంబయిలోని నాగ్ పడాలో వున్న ఏడు రెసిడెన్షియల్ ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వ పరం అయినట్లే. ఈ ఆస్తులు స్వాధీనం చేసుకున్నాక తమ పేర్లకు బదలాయించుకుని దావుద్ తల్లి సోదరి కోర్టు కెక్కారు. 1988 లో ఢిల్లీ హై కోర్టు వీరి వాదనలు ఇలాగే కొట్టేసింది. దీనిపై 1998 లో వీరు సుప్రీం తలుపు తట్టారు.
సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ...
దాదాపు 20 ఏళ్లపాటు నడిచిన ఈ వివాదం ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటించింది. దావుద్ ఆస్తులపై సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తమ వాదన సమర్ధవంతంగా వినిపించింది. ఆస్తులు స్వాధీనం చేసుకున్నాక వారసుల కోసం ఎన్నిసార్లు కోరినా ఎవరు ముందుకు రాని కీలకమైన అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. పదే పదే కోరినా ముందుకు రానివారు తరువాత ఈ ఆస్తులపై హక్కులు కోరడాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. కోట్లరూపాయల విలువైన దావుద్ ఆస్తులు చాలా వరకు ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబాయి బాంబు పేలుళ్ల తరువాత దావుద్ వ్యవహారాలపై మరింత ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తాజాగా కోర్టు తీర్పుతో మిగిలిన ఆస్తులతో న్యాయస్థానం లో వున్న ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూర్తి స్థాయి మార్గం ఏర్పడింది.
