కూలీగా మారిన గ్రేట్ క్రికెటర్

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు డేవిడ్ వార్నర్. ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు వార్నర్ ఏమి చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం ఉండటంతో సొంత ఇంటి నిర్మాణం పై దృష్టి పెట్టాడు వార్నర్. ఇంటికి అవసరమైన టాప్ రూఫ్ కట్ చేస్తూ రాళ్లను డ్రిల్ చేస్తున్న వార్నర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైగా వార్నర్ ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా ఇదంతా చేయడం విశేషం.
కౌంటీలకు త్వరలో ......
నిషేధం ఫలితంగా డేవిడ్ వార్నర్ కెరియర్ పూర్తిగా సందిగ్ధంలో పడినట్లే. దాంతో టచ్ పోకుండా ఉండేందుకు వార్నర్ కొత్త ఆలోచన చేశాడు. కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టి తన సత్తా చాటిచెప్పాలని భావిస్తున్నాడు. కౌంటీ కి వెళ్లేముందు సొంత పనుల్లో ఒక కూలీ మాదిరి కష్టపడటం మొదలు పెట్టాడు. ఇప్పటికే స్టీవ్ స్మిత్ అజ్ఞాతవాసంలో సమయం వృధా చేయకుండా దుబాయిలో క్రికెట్ అకాడమీ పెట్టె యోచన చేశాడు. దాంతో ఈ నిషేధిత స్టార్స్ ఎవరి దారి వారు వెతుక్కునే పనిలో బిజీ అయిపోయారు. ఈ స్టార్స్ ఇంకెప్పుడు తమ డ్రీం టీం లోకి వస్తారో చూడాలి.
