Thu Mar 19 2026 08:51:13 GMT+0530 (India Standard Time)
ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిసింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ తొలినాళ్లలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న మంత్రులకు కూడా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాల్లో జగన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మంత్రులను జిల్లా పార్టీ సేవలకు వినియోగించుకుంటామని చెప్పారు.
ఏప్రిల్ 11న......
నిజానికి ప్లీనరీ తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావించినా ఏప్రిల్ 11వ తేదీన విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జగన్ మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై ఒక జాబితాను రూపొందించారని చెబుతున్నారు. కేవలం నలుగురైదుగురికి మాత్రమే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story

