Thu Mar 19 2026 05:47:46 GMT+0530 (India Standard Time)
మీ తాతను అడుగు లోకేష్
శాసన మండలిని రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని నారా లోకేష్ అడుగుతున్నారని, మీ తాత ఎన్టీఆర్ ను అడుగు అని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. [more]
శాసన మండలిని రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని నారా లోకేష్ అడుగుతున్నారని, మీ తాత ఎన్టీఆర్ ను అడుగు అని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. [more]

శాసన మండలిని రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని నారా లోకేష్ అడుగుతున్నారని, మీ తాత ఎన్టీఆర్ ను అడుగు అని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. 1985లో శాసనమండలిని రద్దు చేసిన విషయాన్ని దాడి వీరభద్రరావు గుర్తు చేశారు. అసెంబ్లీలో చేసే బిల్లులను అడ్డుకుంటూ అభివృద్ధికి ఆటంకం కల్గిస్తున్నారనే నాడు ఎన్టీఆర్ శాససమండలిని రద్దు చేశారని దాడి వీరభద్రరావు తెలిపారు. ఇప్పుడు కూడా చంద్రబాబు శాసనమండలిని అడ్డుపెట్టుకుని బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. బలం ఉంటే బిల్లును తిరస్కరించి పంపాలే తప్ప ఆటంకాలు ఏర్పరచడమేంటని దాడ వీరభద్రరావు తప్పుపట్టారు.
Next Story