Mon Mar 23 2026 21:42:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ట్విస్ట్ ఇచ్చిన డి.శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీలో చేరుతారనుకున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న ఆయన తిరిగి స్వంత గూటికి చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారని అంతా భావించగా... ఇప్పుడు ఆయన ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, అనేకమంది నాయకులు రాహుల్ గాంధీని కలుస్తుంటారని... అదే విధంగా తాను కూడా రాహుల్ గాంధీని కలిశానని పేర్కొన్నారు. రాహుల్ తో ఏం మాట్లాడానో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
Next Story

