Sat Jan 31 2026 15:41:03 GMT+0000 (Coordinated Universal Time)
డీఎస్ సమాధానమిదే...!

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్ పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఎంపీ కవిత నేతృత్వంలో డీఎస్ పై పార్టీ అధినేత కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై నిజామాబాద్ లో తన అనుచరులతో డీ.శ్రీనివాస్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. తనపై చేసిన ఆరోపణలకు డీఎస్ స్పందిస్తూ...సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి, తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు.
Next Story

