రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకేరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ,సైబరాబాద్, రాచకొండ పరిధిలో పెద్దఎత్తున సైబర్ మోసగాళ్ల చేతిలో బలైన బాధితులు [more]
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకేరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ,సైబరాబాద్, రాచకొండ పరిధిలో పెద్దఎత్తున సైబర్ మోసగాళ్ల చేతిలో బలైన బాధితులు [more]

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకేరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ,సైబరాబాద్, రాచకొండ పరిధిలో పెద్దఎత్తున సైబర్ మోసగాళ్ల చేతిలో బలైన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోచుకుంటున్నారు.
డైమండ్స్ బిజినెస్ …..
కరోనా సమయంలో డైమండ్స్ కు పెద్ద ఎత్తున మార్కెట్ ఉందంటూ సైబర్ నేరగాళ్ల ప్రచారం చేశారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న హరీష్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దీనిలో చిక్కుకున్న పాతబస్తీ వాసి నుంచి ఆరు లక్షల రూపాయలు కొట్టేశారు. డైమండ్స్ బిజినెస్ పేరు తో పాతబస్తీకి చెందిన హరీష్ దగ్గర నుంచి సైబర్ నేరగాళ్లు ఆరు లక్షల రూపాయలు వసూలు చేశారు. తక్కువ ధరకు డైమండ్స్ సప్లై చేస్తామంటూ నమ్మబలికారు. ఆన్ లైన్ లో పరిచయమైన సైబర్ నేరగాళ్లకు ఆరు లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత కాని అసలు విషయం హరీష్ కు బోధపడలేదు. డబ్బులు తీసుకొని డైమండ్స్ పంపక పోవడం తో తాను మోసపోయానని గుర్తించి చివరకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
రెండో వివాహం కోసం…
ప్రముఖ వ్యాపార వేత్త కూతురు ని సైతం సైబర్ నేరగాళ్లు మోసగించారు. వ్యాపార వేత్త కూతురి భర్త ఇటీవల చనిపోయారు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు మాట్రిమోని డాట్ కామ్ లో రెండో వివాహం కోసం తన ప్రొఫైల్ ని అప్లై చేసింది. ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసిన కొన్ని రోజులకే ఇటలీ నుంచి ఒక వ్యక్తి కాంటాక్ట్స్ లోకి రావడం జరిగింది . ఇటలీలో ఒక డాక్టర్ గా కొనసాగుతున్నానని తనకు పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులు ఉన్నాయని నమ్మించాడు . అంతే కాకుండా తాను వివాహం చేసుకున్న మహిళతో ఇటలీలోని స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పాడు. సదరు యువతి అతనితో నిత్యం చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇటలీ నుంచి తను విలువైన బహుమతులు పంపిస్తానని చెప్పాడు. ఢిల్లీలోని కస్టమ్స్ అధికారి ఒకరు యువతికి కాల్ చేశారు. మీ పేరుమీద ఒక పార్సెల్ ఉందని అది రిలీజ్ చేయాలంటే పెద్ద మొత్తంలో కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలంటూ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఇందులో విలువైన కరెన్సీ ఉందని ఇది భారతీయ మార్కెట్లోకి తీసుకు రావాలంటే దానికి సంబంధించిన టాక్స్ చెల్లించాలని చెప్పారు. ఇలా పలు రకాలైన టాక్స్ ల పేరుతో దాదాపు 50 వేల రూపాయలు కొట్టేశారు. చివరకు తాను ప్రేమించిన వ్యక్తిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసింది . అతను సెల్ ఫోన్ తో పాటు మెయిల్స్ ఫేస్ బుక్ అకౌంట్ ని కూడా బ్లాక్ చేశాడు. ఈ నేపథ్యంలో తాను మోసపోయానని గుర్తించి వెంటనే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నేరాలు నైజీరియన్ చెందిన యువకులు చేస్తుంటారని పోలీసులు చెప్పారు.

