Mon Mar 23 2026 08:12:09 GMT+0530 (India Standard Time)
దాచేపల్లి సుబ్బయ్య చనిపోయాడా?

దాచేపల్లిలో బాలికపై అత్యాచారం చేసి పారిపోయిన నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గురజాల మండలం దైద దగ్గర సుబ్బయ్య చెట్టుకు ఉరివేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. నిన్ననే సుబ్బయ్య తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి తాను ఇక బతకనని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. దైద సమీపంలో దొరికిన మృతదేహం సుబ్బయ్యదేనని కొందరు చెబుతున్నా పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
Next Story

