లాక్ డౌన్ ఒక రకంగా మంచిదేనట
లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసిందంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్ డౌన్ సమయంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. [more]
లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసిందంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్ డౌన్ సమయంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. [more]

లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసిందంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్ డౌన్ సమయంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఆ ప్రభావంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఉద్యోగ, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక రంగం మొత్తం డ్యామేజీ అయ్యింది. అయితే.. లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసిందంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్ డౌన్ సమయంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎంతలా అంటే.. స్నాచింగ్ రేటు సున్నాకు పడిపోవడం గమనార్హం. మార్చి 1 నుంచి మార్చి 21 వరకు 10 స్నాచింగ్ కేసులు నమోదు కాగా.. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు ఒక్క స్నాచింగ్ కేసు కూడా నమోదు కాలేదు. అదొక్కటే కాదు.. వాహనాల దొంగతనాలు, కిడ్నాప్ కేసులు, దొంగతనాలు, రేప్ కేసులు.. ఇంకా పలు నేరాలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో మార్చి 1 నుంచి మార్చి 21 వరకు 764 కేసులు కాగా, మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు 162 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసింది.

