Mon Mar 23 2026 05:17:04 GMT+0530 (India Standard Time)
జగన్ కంటే పవన్ చాలా బెటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కమలం పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని సీపీఐ జాతీయ నేత నారాయణ స్పష్టం చేశారు. పవన్ కు బీజేపీతో సంబంధాలున్నాయంటూ జరగుతున్న ప్రచారం ఒట్టిదేనన్నారు. తనకు తెలిసినంత వరకూ పవన్ అటువంటి వ్యక్తి కాదని, లోపాయి కారీ సంబంధాలు పెట్టుకోరని నారాయణ పవన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ తో పోలిస్తే పవన్ చాలా బెటరని, అందుకనే జనసేన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకున్నామన్నారు. దమ్ముంటే చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు నమోదు చేయాలని నారాయణ మోడీకి సవాల్ విసిరారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేసీఆర్ పై కేసు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు.
- Tags
- andhra pradesh
- janasena party
- k.chandrasekhara rao
- nara chandrababu naidu
- narednra modi
- note for vote
- pavan kalyan
- telangana
- telugudesam party
- ts politics
- y.s. jaganmohan reddy
- ysrcp
- ఆంధ్రప్రదేశ్
- ఓటుకు నోటు కేసు
- కె. చంద్రశేఖర్ రావు
- జనసేన పార్టీ
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ముఖ్యమంత్రి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
Next Story

