Sun Mar 22 2026 10:20:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోడెలకు షాక్ ఇచ్చిన కోర్టు

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నెల 10న కోర్టు ముందు హాజరై విచారణను ఎదుర్కోవాలని కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు తాను రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవీ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా చెప్పారు. దీంతో కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోడెలపై హైకోర్టులో పిటీషన్ వేసి ఆధారాలు సమర్పించారు. అయితే, అప్పుడు కోడెల స్టే తెచ్చుకోగా స్టే గడువు గత నెల 27న ముగిసింది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేపై కేసుల విచారణకు ప్రత్యేకంగా ఏర్పాటైన కోర్టు కోడెలపై కేసును విచారించింది. కోడెల స్వయంగా ఈ నెల 10 కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Next Story

