Mon Mar 16 2026 05:28:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సూరి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

సంచలనం సృష్టించిన ఫ్యాక్షనిస్టు గంగుల సూర్యనారాయణరెడ్డి(మద్దెలచెరువు సూరి) హత్యకేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. సూరిని ఆయన అనుచరుడు భానుకిరణ్ హత్యచేసినట్లుగా నిర్ధారించిన కోర్టు అతనికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఇక భాను కిరణ్ సహాయకుడు మన్మోహన్ సింగ్ కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కోర్టు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా నలుగురిని నిర్దోషులకు కోర్టు తేల్చేసింది. 2011 జనవరి 3న హైదరాబాద్ లో సూరీ హత్య జరిగింది. ఏడేళ్ల పాటు ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది. మొత్తం 117 మంది సాక్షులను పోలీసులు విచారించారు. భానుకిరణ్ పై సీఐటీ పోలీసులు 3 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు.
Next Story

