Mon Feb 02 2026 03:35:46 GMT+0000 (Coordinated Universal Time)
అనుమానం పెనుభూతమై...

భార్యపై అనుమానం ఇద్దరి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన మాధవ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం నల్గొండ జిల్లా కేతేపల్లికి చెందిన సుమలతతో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన నాటి నుంచి మాధవ్ కు భార్యపై అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇవి భరించలేక కొన్ని రోజులుగా సుమలత తల్లిగారింట్లోనే ఉంటోంది. ఇటీవలే భర్త ఇంటికి వచ్చింది. అయితే, ఇవాళ తెల్లవారు జామున విద్యానగర్ వద్ద రైలు కింద పడి మాధవ్ మృతి చెందాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా డోర్లు పెట్టి ఉన్నాయి. దీంతో పగలగొట్టి చూడగా సుమలతకు ఉరి బిగించడంతో మరణించింది. అయితే, మాధవ్ సుమలతను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
Next Story

