Sat Jan 31 2026 11:27:55 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గుముఖం పడుతుంది… కంటెయిన్ మెంట్ జోన్లు ఎత్తివేత
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజు 17 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజు 17 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజు 17 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 29 మంది మరణించారు. కొత్తగా నమోదయిన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. మిగిలినవి రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. శనివారం 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నిన్నటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 19 కంటెయిన్ మెంట్ జోన్లు ఎత్తివేశారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 499గా ఉంది.
Next Story