Sun Mar 29 2026 21:18:35 GMT+0530 (India Standard Time)
స్పీకర్ కు కరోనా.. ఆందోళనలో ఇద్దరు ముఖ్యమంత్రులు
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. పోచారం శ్రీనివాసరెడ్డి ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
వివాహానికి హాజరయి....
కాగా నాలుగు రోజుల క్రితం పోచారం శ్రీనివాసులరెడ్డి మనవరాలి వివాహం జరిగింది. ఈ వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు హాజరయ్యారు. పోచారంతో కలిసి భోజనం కూడా చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story

