Sat Mar 21 2026 08:07:12 GMT+0530 (India Standard Time)
ఏపీలోనూ విజృంభిస్తున్న కరోనా.. ఆగని వైరస్
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,929కు చేరుకుంది. ఒక్కరోజే కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 106కు చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఏపీలో 4,307 గా ఉంది. యాక్టివ్ కేసులు 4,516 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Next Story