Sun Mar 08 2026 01:27:21 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో [more]
టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో [more]

టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షకీల్ తండ్రి, తల్లి, సోదరిలకు కూడా కరోనా సోకడంతో వారంతా చికిత్స చేయించుకుంటున్నారు. తనను వారం రోజులుగా కలసి వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని షకీల్ కోరారు. పూర్తి ఆరోగ్యంతోతిరిగి వస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షకీల్ చెప్పారు.
Next Story