Mon Mar 16 2026 21:49:11 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేసి.. అక్కడ మాత్రం?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2069 కేసులు నమోదయ్యాయి. 53 మంది మరణించారు. దీని సంఖ్య మరింత పెరిగే [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2069 కేసులు నమోదయ్యాయి. 53 మంది మరణించారు. దీని సంఖ్య మరింత పెరిగే [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2069 కేసులు నమోదయ్యాయి. 53 మంది మరణించారు. దీని సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 294 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే లాక్ డౌన్ వేళలను మార్చడం, కొన్ని హాట్ స్పాట్ ప్రాంతాలకే పరిమితం చేయడం వంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం దిగనుంది.
Next Story