Thu Feb 05 2026 05:08:02 GMT+0000 (Coordinated Universal Time)
పెరుగుతున్న కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో ఒక్కరోజే
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఒక్కరోజే తెలంగాణాలో 1,213 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 8మంది మృతి చెెందారు. దీంతో [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఒక్కరోజే తెలంగాణాలో 1,213 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 8మంది మృతి చెెందారు. దీంతో [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఒక్కరోజే తెలంగాణాలో 1,213 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 8మంది మృతి చెెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 275కు చేరింది. కొత్తగా నమోదయిన 1,213 కేసుల్లో దాదాపు వెయ్యి కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ ప్రారంభమయ్యాక ఇన్ని కేసులు ఒక్కరోజులో తెలంగాణలో నమోదవ్వడం ఇదే ప్రధమం.
Next Story