Mon Mar 16 2026 10:27:15 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ ను వదలడం లేదే? కేసీఆర్ మరింత కఠినంగా?
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని కరోనా వణికిస్తోంది. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 51 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని కరోనా వణికిస్తోంది. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 51 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని కరోనా వణికిస్తోంది. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 51 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1326కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా తెలంగాణలో ఇద్దరుచనిపోయారు. దీంతో కరోనా కారణంగా తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 32కు చేరుకుంది. తాజాగా నమోదయిన 51 కేసుల్లో 37 కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనివే. మిగిలినవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలుగా అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో లాక్ డౌన్ నిబంధనలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠినతరం చేసే అవకాశముంది.
Next Story