Tue Mar 17 2026 07:19:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తగ్గడం లేదు.. పెరగడం లేదు…తెలంగాణలో
తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగానే ఉంది. ఇటు కేసుల సంఖ్య పెరగడం లేదు. అలాగని తగ్గడం లేదు. తాజాగా ఈరోజు 1,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగానే ఉంది. ఇటు కేసుల సంఖ్య పెరగడం లేదు. అలాగని తగ్గడం లేదు. తాజాగా ఈరోజు 1,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగానే ఉంది. ఇటు కేసుల సంఖ్య పెరగడం లేదు. అలాగని తగ్గడం లేదు. తాజాగా ఈరోజు 1,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,424కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 729 కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 21,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 75,186 గా ఉంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 8.23 లక్షల టెస్ట్ లను చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story