Mon Feb 02 2026 14:00:33 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత తెలంగాణలో కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 66 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం 1920 కరోనా [more]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 66 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం 1920 కరోనా [more]

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 66 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం 1920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన 66 కేసుల్లో హైదరాబాద్ లోనే 31 మంది ఉన్నారు. పదిహేను మంది వలస కూలీలకు కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 1,164 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 700 ఉన్నాయని హెల్త్ బులిటెన్ లో అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 56 మంది మృతి చెందారు.
Next Story