తెలంగాణలో కరోనా తగ్గుతుంది.. కానీ?
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న కేవలం 11 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న కేవలం 11 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న కేవలం 11 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ 1107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా వ్యాధి నుంచి కోలుకుని 648 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాధితో బాధపడుతూ 430 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణాలో 29 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఇక్కడ లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ మాస్క్ లేనిదే బయటకు వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.