Wed Mar 18 2026 08:22:15 GMT+0530 (India Standard Time)
కరోనా ఆగడం లేదు… మరణాల సంఖ్య కూడా?
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 357 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 357 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 357 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా వల్ల భారత్ లో మృతి చెందిన వారి సంఖ్య 8,102కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 9996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,86,579కు చేరుకుంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం భారత్ లో ఆందోళన కల్గిస్తుంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1.41 లక్షల మంది. కరోనా బారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,37,448గా ఉంది. మొత్తం మీద కరోనా వైరస్ భారత్ ను భయపెడుతోంది.
Next Story

