Fri Dec 05 2025 13:29:40 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka results : ఎమ్మెల్యేల కోసం స్పెషల్ ఫ్లైట్ సిద్ధం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కర్ణాటక ఎన్నికలలో ముందంజలో ఉన్నారు. రాజస్థాన్ తరలించేందుకు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేశారు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కర్ణాటక ఎన్నికలలో ముందంజలో ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకూ 111 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థులు ముప్ఫయి స్థానాల్లో మెజారిటీ దిశగా పయనిస్తున్నారు. ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం స్పెషల్ ఫ్లైట్‌ను బెంగళూరులో సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటకే అభ్యర్థులందరినీ బెంగళూరుకు వచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారిని అక్కడి నుంచి రాజస్థాన్‌కు తరలించనున్నారు.
రాజస్థాన్‌కు...
బెంగళూరు నుంచి రాజస్థాన్‌కు నేరుగా తరలించేందుకు స్పెషల్ ఫ్లైట్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడీగా పెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్ నేతలు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంది. పూర్తి ఆధిక్యత వచ్చినా బీజేపీ ఏదైనా ఇబ్బంది కలుగ చేసే అవకాశముందని భావించి ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్‌నకు తరలిస్తున్నారని చెబుతున్నారు.
Next Story

