పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై [more]
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై [more]

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై భూ దందా ఆరోపణలు రావడంతో కేటీఆర్ ఫాం హౌస్ ను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. మీడియాను తీసుకుని గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ ఫాం హౌస్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిబంధనలను తుంగలో తొక్కి కేటీఆర్ ఫాం హౌస్ ను నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 25 ఎకరాల్లో నిర్మించిన కేటీఆర్ ఫాంహౌస్ ను ముట్టడించేందుకు బయలుదేరిన రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.