Tue Feb 18 2025 09:41:39 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసల జల్లు
ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల [more]
ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల [more]

ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. తన విజయంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ విజయం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. వైఎస్ జగన్ తన తండ్రిలా పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉన్నారని అన్నారు. జగన్ పోరాటయోధుడని, అనుకున్న లక్ష్యాన్ని సాధించారన్నారు. వైఎస్సార్ కుటుంబం మాట మీద నిలబడే కుటుంబమని, జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసి గొప్ప ముఖ్యమంత్రిగా గుర్తింపు పొంది రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెడతారని పేర్కొన్నారు.
Next Story