Sat Mar 21 2026 01:03:35 GMT+0530 (India Standard Time)
నాగం దెబ్బకు ఎమ్మెల్సీ అవుట్...!

పాలమూరు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత రెండున్నర దశాబ్ధాలుగా నాగం జనార్ధన్ రెడ్డితో రాజకీయ వైరమున్న దామోదర్ రెడ్డి నాగం చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ఉదయం జరిగిన సీఎల్సీ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఆయనను ఆహ్వానించడంతో దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది..
Next Story

