Wed Mar 18 2026 16:38:34 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ సభకు హాజరైన ప్రముఖులు

మేడ్చెల్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పలు పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ జన సమితి అధినేత ప్రొ.కోదండరాం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు సభకు హాజరయ్యారు. ప్రత్యేకించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మొదటిసారి రాష్ట్రానికి వచ్చినందున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ దంపతులు ఆమెను సోనియా గాంధీని కలిశారు. విమలా గద్దర్ సోనియా గాంధీకి చీరను బహుకరించారు.
Next Story

