Fri Dec 05 2025 18:52:03 GMT+0000 (Coordinated Universal Time)
సీల్డ్ కవర్లో పేరు వస్తుందా?
ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం బెంగళూరులో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది

ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం బెంగళూరులో జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అయితే కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అన్న దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. పీససీీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా, మధ్యేమార్గంగా పరమేశ్వర పేరు కూడా వినిపిస్తుండటం విశేషం.
రేపు ప్రమాణం...
136 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. రేపు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఎవరనేది ఈరోజు సాయంత్రానికి కాని తేలదు. శాసనసభ పక్షం ఎన్నుకుంటుందా? సీల్డ్ కవర్లో అధినాయకత్వం లేఖను పంపుతుందా? అన్నది చూడాల్సి ఉంది. హైకమాండ్ ఎవరి పేరును ముఖ్యమంత్రి పదవి కోసం సూచిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.
సీఎస్, డీజీపీలు...
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కలిసేందుకు కర్ణాటక ప్రస్తుత చీఫ్ సెక్రటరీ, డీజీపీలు అపాయింట్మెంట్ కోరారు. కానీ సీఎల్పీ సమావేశం తర్వాత కలవాలని ఇద్దరూ వారికి సూచించారు. ఇప్పటికే ఇద్దరి నివాసాలకు అదనపు భద్రతా బలగాలు చేరుకుని వారికి ప్రత్యేక భద్రతను కల్పించారు. ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని భావించి ఇద్దరికి భద్రత కల్పించారు.
Next Story

