Sun Mar 15 2026 18:23:24 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ విలీనం

తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తూ శాసనమండలి ప్రకటన చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, దామోదర్ రెడ్డి, ప్రభాకర్ లు తమ పార్టీ శాసనమండలిపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కి లేఖ ఇచ్చారు. అయితే, వారు ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉన్నారని, వారికి లేఖను పరిగణలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ నేతలు స్వామిగౌడ్ ని కోరారు. అయితే, న్యాయ సలహా తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తూ నలుగురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించారు.
Next Story

