Mon Mar 16 2026 23:18:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆదిక్యత ప్రదర్శించగా ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. టీఆర్ఎస్ 23 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. నల్గొండ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. పాలేరు లో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య, ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ ముందంజలో ఉన్నారు. నల్గొండ, మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందంజలో ఉన్నారు.
Next Story

