Mon Mar 17 2025 14:23:40 GMT+0000 (Coordinated Universal Time)
ముఖేష్ గౌడ్ మృతి
కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ నగరంలో పట్టున్న నేత ముఖేష్ గౌడ్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముఖేష్ కు ఇద్దరు [more]
కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ నగరంలో పట్టున్న నేత ముఖేష్ గౌడ్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముఖేష్ కు ఇద్దరు [more]

కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ నగరంలో పట్టున్న నేత ముఖేష్ గౌడ్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముఖేష్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో అపోలో ఆసుపత్రిలో ముఖేష్ గౌడ్ ను కుటుంబ సభ్యులు చేర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గోషామహల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Next Story