Wed Mar 18 2026 17:28:43 GMT+0530 (India Standard Time)
ప్రగతి భవన్ ముట్టడికి కోమటిరెడ్డి....!

‘తెలంగాణ ఇచ్చింది అమ్మ కాదు...బొమ్మ కాదు..’ అంటూ సోనియా గాంధీని ఉద్దెశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ను ప్రగతి భవన్ ముట్టడికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ నేతలు ర్యాలీగా ప్రగతి భవన్ కి బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితిలో ర్యాలీ నిర్వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భీష్మించుకు కూర్చోవడంతో ఆయనతో పాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనీల్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story

