Mon Feb 02 2026 20:13:53 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎంపీలపై ఫిర్యాదు

పార్లమెంట్ లో డ్రామాలాడుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ స్థాయిని దిగజార్చుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్పీకర్ సుమిత్రా మహజన్ కు కలిసి టీడీపీ ఎంపీల డ్రామాలను తెరదించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ ఎంపీలు రోజుకో నాటకం, వేషం వేస్తూ పార్లమెంటును అభాసుపాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ లో టీడీపీ డ్రామాలకు త్వరలోనే తెరపడబోతోందని స్పష్టం చేశారు. ప్రచారం కోసం పార్లమెంట్ ను ఉపయోగించుకోవడం సరికాదని, పాలన వదిలేసి టీడీపీ దగా రాజకీయాలు చేస్తుందని విమర్శించారు
Next Story

