Mon Feb 02 2026 01:59:44 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ కి బీజేపీ మిత్రపక్షం ప్రశంసలు

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం పట్ల జాతీయ పార్టీల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతునాయి. అయితే, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే కొరకరాని కొయ్యగా మారిన శివసేన పార్టీ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. శుక్రవారం పార్లమెంట్ లో జరిగిన సంఘటనపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ... అది కౌగిలింత కాదని, ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక షాక్ అని పేర్కొన్నారు. రాహుల్ ఇప్పుడు అసలైన రాజకీయాల్లో పట్టబద్రుడయ్యారని ప్రశంసించారు. గతంలోనూ పలు సందర్భాల్లో శివసేన రాహుల్ కి మద్దతుగా నిలిచింది.
Next Story

