Sun Feb 01 2026 17:03:32 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రికి ఇంగ్లీష్ రాదు...కుమారుడికి తెలుగు రాదు

తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేవలం రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఆ పార్టీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో అఖిలపక్ష భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విభజన హామీలను ప్రస్తావిస్తే మోడీ స్పందించలేదని పేర్కొన్నారు. నాటు సారా అమ్ముకునే వ్యక్తిని ఎంపీగా పంపిన ఘనత టీడీపీది అని, చంద్రబాబు నాయడుకు ఇంగ్లీష్ రాదని, లోకేష్ కు తెలుగు రాదని, వీరు ఏ విధంగా పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
Next Story

