Mon Mar 16 2026 03:00:19 GMT+0530 (India Standard Time)
ప్రముఖ హాస్యనటుడు మృతి
ప్రముఖ హాస్యనటుడు, డైరెక్టర్ మనోబాల మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

ప్రముఖ హాస్యనటుడు, డైరెక్టర్ మనోబాల మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ గా మనోబాల గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి నెలలో గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. యాంజియో చేయించుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తమిళ పరిశ్రమలో...
అయితే ఆయన ఈరోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో తమిళ పరిశ్రమ ఒక గొప్ప హాస్యనటుడిని కోల్పోయిందని చిత్ర ప్రముఖులు అనేక మంది పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అని కూడా పలువురు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

