Sun Mar 22 2026 08:59:29 GMT+0530 (India Standard Time)
సీఎం రమేశ్ కు వరద వార్నింగ్....!

తాను బతికున్నంత కాలం సీఎం రమేశ్ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి రానివ్వనని మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో గత కొన్ని రోజులుగా ఇంఛార్జి వరదరాజులు రెడ్డికి, ఎంపీ సీఎం రమేశ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నిన్న సీఎం రమేశ్ వర్గానికి చెందిన 22 మంది టీడీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. దీంతో వరదరాజులు రెడ్డ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేశ్ వెనుక నుంచి రాజకీయాలు నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన కుటుంబంలో ఎవరినైనా ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం రమేశ్ ఇలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.
Next Story

