Sun Mar 22 2026 23:01:05 GMT+0530 (India Standard Time)
ముగిసిన ఐటీ సోదాలు

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ముగిశాయి. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోని ఆయన స్వగృహంలోనూ, హైదరాబాద్ లోని రిత్విక్ కనస్ట్రక్షన్స్ కార్యాలయంలోనూ ఈరోజు ఉదయం ఐదుగంటలకు మొదలైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనంచేసుకున్నట్లుతెలుస్తోంది. మరోవైపు సీఎం రమేష్ మాత్రం తాను ఐటీ సోదాలకు సహకరిస్తానని, అయితే కేంద్రం చెప్పినట్లు కక్ష పూరితంగా తనపై దాడులు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Next Story

