Sat Jan 31 2026 12:49:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాదంలో సీఎం రమేష్

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేపట్టిన ఆమరణ దీక్ష ఏడోరోజుకు చేరుకుంది. ఇద్దరి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఇలాగే కొనసాగిస్తే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా వారు దీక్ష విరమణకు అంగీకరించడం లేదు. ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని తెలుగుదేశం నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ దీక్షపైనా, వారిద్దరి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేసినట్లు తెలుస్తోంది.
Next Story
