Thu Mar 19 2026 02:39:56 GMT+0530 (India Standard Time)
ఆ దీక్షను గిన్నీస్ రికార్డుకు ఎక్కించాలి

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన దీక్షపై బీజేపీ ఎంపీ విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మామూలుగా షుగర్ ఉన్న వారు ఒకటిరెండు రోజులు తినకుండా ఉండటమే కష్టమని, అటువంటిది రమేష్ 11 రోజులు నిరాహార దీక్ష చేయడం సామాన్య విషయం కాదని, దీనిని గిన్నీస్ రికార్డులోకి ఎక్కించాలని ఆయన ఎద్దేవా చేశారు. అయితే, హోంగార్డులకు వేతనాల పెంపు విషయంలో మాత్రం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story

