Thu Mar 19 2026 08:33:20 GMT+0530 (India Standard Time)
సీఎం రమేష్ కు కేంద్ర మంత్రి ఫోన్

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఫోన్ చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని, కాబట్టి దీక్ష విరమించాలని ఆయన కోరినట్లు తెలిసింది. అంతకుముందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీరేంద్ర సింగ్ ను కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడప, బయ్యారంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని మంత్రి సమాదానం ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఇంకొంత సమాచారం రాష్ట్రం ఇవ్వాల్సి ఉందని మంత్రి తెలిపారు.
Next Story

