Wed Jan 28 2026 14:50:18 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టికల్ 356 ఉందని మర్చిపోవద్దు
రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న వరస దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని సీఎం రమేష్ [more]
రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న వరస దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని సీఎం రమేష్ [more]

రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న వరస దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని సీఎం రమేష్ చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా శాంతిభద్రతల విషయంలో విఫలమయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు సీఎం రమేష్. ఆర్టికల్ 356 అన్నది ఒకటి ఉందని మర్చి పోవద్దని సీఎం రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైన దేవాలయాలపై జరిగిన దాడులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు.
Next Story