Mon Mar 23 2026 00:33:24 GMT+0530 (India Standard Time)
వేలకోట్లు తిన్న ఆంబోతులకు...?

ట్విట్టర్లో సీఎం రమేష్ కు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. వేల కోట్లు తిన్న ఆంబోతులు విసిరిన సవాల్ కు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఆదాయపు పన్ను శాఖ దాడులు విధుల్లో భాగంగా జరిగేవేనన్నారు. గతంలో సుజనా చౌదరి తనతో బహిరంగ చర్చకు వస్తానని తోక ముడిచారన్నారు. సీఎం రమేష్ కూడా అంతేనన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్లకే భయమని, ఐటీ దాడులు జరిగితే అది ప్రజలపై దాడి అని తెలుగుదేశం నేతలు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నది ఏపీ మాత్రమేనని తెలుగుదేశం నేతలు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రమేష్ తనతో జీవీఎల్ బహిరంగ చర్చకు రావాలని కోరడంతో ఆయన ఈ విదంగా స్పందించారు.
Next Story

