మరి కాసేపట్లో చిట్టాపూర్ కు కేసీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ లో రామలింగారెడ్డి [more]

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ లో రామలింగారెడ్డి భౌతిక కాయానికి అంత్య క్రియలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు మరికాసేపట్లో చిట్టాపూర్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే రామలింగారెడ్డి భౌతిక కాయానికి పలువరుటీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నివాళులర్పించారు. మంత్రి హరీశ్ రావు చిట్టాపూర్ చేరుకుని రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.