బ్రేకింగ్ : మే 28 వరకూ లాక్ డౌన్.. మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్
ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కొనసాగించాలని [more]
ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కొనసాగించాలని [more]

ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కొనసాగించాలని దాదాపు నిర్ణయించారు. ఇదే సమయంలో లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నారు. మద్యం షాపులను కూడా తెలంగాణలో తెరవాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో ఇక్కడ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలు ఉంటాయి. దీంతో పాటు మద్యం ధరలను కూడా భారీగా పెంచే అవకాశముంది. రేపటి నుంచే మద్యం దుకాణాలు తెరుచుకునేలా ప్రభుత్వం నిర్ణయం ఉండే అవకాశముంది. విద్యాసంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహణపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.

