Fri Apr 03 2026 04:41:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ధాన్యాన్ని మేమే కొంటాం - సీఎం కేసీఆర్
రైతులు ఒక్క రూపాయి తక్కువకు కూడా ధాన్యాన్ని అమ్ముకోవద్దని కేసీఆర్ సూచించారు. మూడ్రోజుల్లోనే రాష్ట్రంలో ధాన్యం సేకరణ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ యాసంగిలో పండించిన ప్రతి వడ్ల గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులు ఒక్క రూపాయి తక్కువకు కూడా ధాన్యాన్ని అమ్ముకోవద్దని కేసీఆర్ సూచించారు. మూడ్రోజుల్లోనే రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని, క్వింటాల్ కు రూ.1960 ఇచ్చి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలుంటాయో.. ఆయా రాష్ట్రాలపై కేంద్రం కపట ప్రేమను చూపిస్తుందని, ఎన్నికలవగానే మొండిచేయి చూపిస్తుందని విమర్శించారు. రైతులు లేకపోతే దేశమే లేదన్నారు.
Next Story

